BSNL Cinema Plus Subscription: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) సరికొత్త ప్లాన్ ద్వారా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు షాకిచ్చింది. బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్(BSNL Cinema Plus Subscription) అనే కొత్త సర్వీసును తన వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఇక నుంచి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఎంచక్కా తమకు నచ్చిన సినిమాలు వీక్షించేందుకు కొన్ని ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు మీకు అందుబాటులోకి రానున్నాయి.
బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్(BSNL Cinema Plus Subscription) సర్వీస్ ధర రూ.199తో తీసుకొచ్చింది. అయితే ఆఫర్ కింద తొలి నెలలు రూ.129కే బీఎస్ఎన్ఎల్ ఈ సర్వీస్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ యప్ టీవీ(Yupp TV)తో కలిసి ఈ కొత్త సినిమా ప్యాక్ తీసుకొచ్చింది. సోనీ లైవ్ స్పెషల్(SonyLiv Special), యప్ టీవీ ప్రీమియం, జీ5 ప్రీమియం(Zee5 Premium) వంటి సేవలను ఈ ప్యాక్ ద్వారా పొందవచ్చు.
Also Read: ATM Alert: ఇక నుంచి ఆ ATM Transactions మీరు చేయలేరు, ఈ కారణం తెలుసుకోండి
బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ సర్వీస్ యాక్టివేట్ చేసుకుని ఇకనుంచి మీరు ఎంచక్కా ఓటీటీలో సినిమాలు వీక్షించండి. ఈ సర్వీస్ కోసం రీఛార్జ్ చేసుకుంటే యప్ టీవీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. యప్ టీవీ స్కోప్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్(Android Latest Updates), ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్(Google Play Store), యాపిల్ యాప్ స్టోర్స్‌లో యప్ టీవీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీకు కావాలసిన సినిమాలు, ప్రోగ్రాములు వీక్షించండి.
Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే
వెబ్ బ్రౌజర్ ద్వారా సైతం బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ ఆఫర్ యాక్సెస్ చేసుకోవచ్చు. కేవలం సినిమాలు మాత్రమే కాదు స్పోర్ట్స్, చిన్నారులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా అందిస్తోంది. యప్ టీవీ సబ్‌స్క్రిప్షన్ లభించిన తరువాత మీకు వందల ఛానెల్స్ అందిస్తోంది. ఈ ప్లాన్ ప్రైవేట్ టెలికాం సంస్థలు వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలకు గట్టి పోటీ వ్వనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook